Powered By Blogger

Saturday 23 July 2011

love story




బ్రౌన్ నిఘంటువు ప్రకారము తెలుగు పదమైన 'వేర్పాటు' అనే పదానికి అర్థం 'విడిపోవటము (Separation)' అని. దేనికి సంబంధించి అయినా విభజించటం అనే ప్రక్రియను వేర్పాటు అనే అంటారు. అది రాష్ట్రమైనా దేశమైనా పండైనా మరేదయినా. మరి విభజనను కోరుకునేవారిని వేర్పాటువాదులనక ఇంకేమంటారు? మా భాషైన తెలుగున విభజన కోరుకునేవారిని వేర్పాటువాదులనటం సర్వదా అమోదయోగ్యమే. దీనికి తెలంగాణవాదులు తెగ గింజుకోవాల్సిన అవసరమేమీ లేదు.

అదే బ్రౌన్ నిఘంటువు ప్రకారం తెలుగు పదమే అయిన 'వలస'కు అర్థం 'ఒక దేశము నుంచి మరో దేశానికి శత్రుభయముచేత మరో దేశానికి వెళ్ళటం'. తెలంగాణా సీమాంధ్రా తీరాంధ్రలు ఒకే దేశములో ఉన్నప్పుడు తీరాంధ్ర-సీమాంధ్ర ప్రజలు అదే దేశములోని మరోచోటికి వెళ్ళి బతుకుతుంటే అవి వలసలెలా అవుతాయి? వెనకబాటు పేరు చెప్పి ఉమ్మడి సొత్తు అప్పనంగా దండుకున్న (దండుకుంటున్న) తెలంగాణకు తీరాంధ్ర-సీమాంధ్రులు సాగించేది కేవలం పట్టెడన్నం కోసం సాగించే 'అన్నపువలసలే' తప్పించి మరోటికాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిథులు రాష్ట్ర రాజధానిలో కాక మరెక్కడనుంచి పరిపాలన చేస్తారు? అలా చేస్తే అది వలసవాద ప్రభుత్వం ఎలా అవుతుంది? తెలంగాణలో ఎన్నికలు జరగలేదా లేక తెలంగాణను సీమాంధ్ర-తీరాంధ్ర ప్రజలు సైనికంగా ఆక్రమించారా? ఒకే రాజ్యాంగము మీద కదా ప్రమాణం చేసేది ఇరుప్రాంతాల నాయకులూ!

చదువుకున్నా మూర్ఖులైన తెలంగాణవాదులకు జవాబులు తెలియవా తెలిసీ శవరాజకీయాల మత్తులో జోగుతున్నారా?

మేలుకో ఆంధ్రుడా మేలుకో
సిక్కోలు నుంచి హిందూపురం కదం తొక్కాలి
అవమానపు దంపుళ్ళకు బదులు చెప్పాలి
ఈ జాతి స్వేచ్చకై ఉద్యమించాలి
తెలుగుతల్లి చీరకొంగుకు పూసిన మైల మరీ మరీ చెబుతోంది
మేలుకో ఆంధ్రుడా మేలుకో 
http://krishnaveniteeram.blogspot.com/2011/07/blog-post_23.html

No comments:

Post a Comment