Powered By Blogger

Tuesday 2 August 2011






మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.

లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.

అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.



ప్రాణ స్నేహితుడననా 
నీకంటే ప్రాణమెక్కువేమీ కాదే 

మరువలేని తీపి జ్ఞాపకమననా 
ఎప్పుడూ మది వీడనేలేదే 

నా శ్వాస అందామంటే అది 
ఆగినా నాతోనే వుంటానన్నావే 

ఈ చిన్ని గుండెని ప్రేమించే 
మరో చిన్ని గుండెవననా 

నను అపురూపంగా చూసుకునే 
నా మనసెరిగిన నా మురిపెమననా 

నాలో భాగమైపోయి నీ చేయి నుంచి 
జాలువారిన నీ బొమ్మవననా 

నిన్ను నువు దాచుకోలేక నా వొడిలో 
ఒదిగిపోయే నా చిన్ని నేస్తమననా 

కొండంత నమ్మకాన్ని నీపై పెంచుకున్న 
నను గుండెల్లోనే దాచుకున్న నా ప్రాణమననా 

నేనున్నానంటూ అమాయకంగానే నమ్మకంతో 
చెప్పే నెనెరిగిన నా ప్రియ నేస్తమననా 

నే కలత చెందితే కన్నీరు పెట్టే 
ఏ కల్మషమూ లేని పసి హృదయమననా... 

 ·  · Share

love story


కొలిచే దేవుళ్ళెందరున్నా 
మదిలో కొలువైనది నువ్వే 

విరబూసే పువ్వులెన్నున్నా 
వాడని చిరునవ్వు నీదే 

పాడే కోయిలలెన్నున్నా 
వినిపించే గానం నీదే 

చూసే కళ్ళు నావైనా 
అవి తాకే హృదయం నీదే 

చిరుగాలి తాకేది నన్నైనా 
మదిలో మెదిలే తలపు నీదే 

చెదిరే కలలెన్నున్నా 
చెదరని రూపం నీదే 

కరిగే క్షణాలెన్నున్నా 
కరగని జ్ఞాపకాలు నీవే 

తరిగే కాలం ముందున్నా 
తరగని కన్నీళ్ళు నీవల్లే 

మౌనమె నా మది భాషైనా 
అందులో మాటల సందడి నీదే 

నదిచే బాటలెన్నున్నా 
పరిగెత్తే పయనం నీవైపే 

పిలిచే పిలుపులెన్నున్నా 
పిలవని తలపులు నీవే 

తపించే హృదయం నాదైనా 
తలపించే మధురిమ నీదే 

చెరిగే గాయాలెన్నున్నా 
చెరగని గురుతులు నీవే 

తీసే ఊపిరి నాదైనా 
అది పొసే ప్రాణం నీదే 

ఆగిపోయే గుండే నాదైనా 
ఆగని ప్రేమ నీపైనే 

ఏడడుగులు బంధం నీతో లేకున్నా 
ఏదు జన్మల అనుబంధం నీతోనే 

జీవన పయనం లో దారులెన్నున్నా 
అంతిమ గమ్యం నీ దరికే

 ·  · Share