Powered By Blogger

Thursday 29 September 2011

ఒక మాస్టారు ఆరో తరగతి పిల్లలకు మహాభారతం కథను బోధిస్తున్నాడు. అందులో కృష్ణుని జన్మ వృత్తాంతం గురించి ప్రస్తావన వచ్చింది.
“సోదరి యొక్క అష్టమ సంతానం చేతిలో తన చావు తప్పదని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న కంసుడు ఆగ్రహోదరుడయ్యాడు. దేవకీని ఆమె భర్తను కారాగారంలో బంధించమని ఆజ్ఞ జారీ చేశాడు.”
“మొదటి కొడుకు పుట్టాడు. కంసుడు ఆ బిడ్డను విషమిచ్చి చంపేశాడు. రెండో కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తైన కొండ మీద నుంచి తోసి చంపి వేయించాడు. ……” చెప్పుకుంటూ పోతున్నాడు.
వారిలో కొంచెం తెలివైన విద్యార్థికి ఒక సందేహం వచ్చింది. బుర్ర గోక్కుంటూ
“మాస్టారూ! నాదో చిన్న సందేహం” అన్నాడు
“భారతదేశంలో అందరూ మహాభారతాన్ని విశ్వశిస్తారు నాయనా! నీ సందేహమేమిటో చెప్పు నేను తీరుస్తాను”
“మరి కంసుడికి దేవకికి పుట్టే సంతానం చేతిలో మరణం ఉందని తెలుసు కదా? అయితే వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఎందుకు బంధించాడు?”
మాస్టారికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.











మూడేళ్ళ చింటూ ఆసుపత్రిలో గర్భంతో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు.

“అమ్మా! నీ పొట్ట ఎందుకు అంత పెద్దదిగా ఉంది?” అడిగాడు చింటూ.

“లోపల పాపాయి ఉంది నాన్నా… అందుకు ” అంది వాళ్ళమ్మ.

“నీ పొట్టలో పాపాయి ఉందా?” ఆశ్చర్యంగా అడిగాడు చింటూ.

“అవును బాబూ, బుజ్జి పాపాయి ఉంది”

“అయితే ఆ పాపాయి మంచిదేనా?”

“నిజంగా మంచి పాపాయే నాన్నా…”

“అయితే నువ్వెందుకు తినేశావ్?”











నిండుగా విరభూసావు....
సిగ్గుతో ఎర్రబడ్డావు....
ప్రేమకి చెరగని చిహ్నమై నిలిచావు...
మాటైనా మాట్లాడకుండా...
నా చెలి మనసు దోచేసావు...
నేను నీలాగైనా పుట్తుంటే బాగుండుకదా
అని అని పించేలా చేసావు...
.....బాబు














వలలో
తల్లి చేప ఇరుక్కుంది.,
నది మొత్తం-
పిల్ల చేప కన్నీళ్ళతో
నిండిపోయింది.

ఈదడం ఆపేసి,
సేద తీరుతోంది-
వలలో చేప!

చిన్న చేప
కొంగతో-
లేచిపోయింది!











నిరంతరమూ వసంతములే.. మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫలాలుగ పండే
నిరంతరమూ వసంతములే.. మందారములా మరందములే....

హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం..
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం..
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం..
అలలపయి నాట్యమాడే వెన్నెలే వేణగానం..
ఆకశానికవి తారలా.. ఆశపున్న విరి దారులా..
ఈ సమయం ఉషోదయమయి..మా హృదయం జ్వలిస్తుంటే.. ''నిరంతరమూ''

అగ్ని పత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే..
మెరుపులే ఝల్లు రాసీ మేఘమే మూగవోయే..
మంచుధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే..
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే..
మల్లెకొమ్మ చిరునవ్వులా..మనసులోని మరుదివ్వెలా..
ఈ సమయం రసోదయమయి..మా ప్రణయం ఫలిస్తుంటే.. ''నిరంతరమూ''


















No comments:

Post a Comment