Powered By Blogger

Wednesday 20 July 2011

తెలుగు కవితలు




ఉదయించిన సూర్యున్ని అడిగా నీవు క్షేమమా అని చల్లగా వీచే గాలులను అడిగా నీ చిరునవ్వులు ఏవి అని పున్నమి వెన్నెల వెలుగుని అడిగా నీ మంచి మనస్సు ఎక్కడని వనం లోను పూలను అడిగా నీ పరిమళం ఏది అని ఆకాశం లో మబ్బులను అడిగా నీ జాడ ఎక్కడ అని కనిపించిన ప్రతి శిలను అడిగా నీవు ఎక్కడ అని సెలయేరు సవ్వడిని అడిగా నీ మువ్వల సవ్వడి వినాలని నీతో మాట్లాడాలని కన్నిళ్ళు ఇంకిన మనసుతో నీ కోసం ఎదురు చూస్తున్నా .

విషాదం నిండిన మనసులో సంతోషాన్ని నింపావు బిడియం తో ఉన్న నాకు అల్లరిని నేర్పావు కలలే రాని నాకు కవితలే నేర్పించావు వర్ణాలు తెలియని నాకు నీ రంగుల స్వప్నం చూపించావు నా కవితకు ప్రాణం నీవు నిను విడిచి ఉండలేను .

No comments:

Post a Comment