Powered By Blogger

Wednesday 20 July 2011

తెలుగు కవితలు



మనసు :- కనులు కనులు కలిస్తె ఈ పగలే గడచిపోతుంది తనువు తనువు కలిస్తె ఈ రేయే గడచిపోతుంది మనసు మనసు కలిస్తె ఈ జీవితమే గడచిపొతుంది.


కలల కల్లలు :- నీ మాటల సవ్వడిలో మరపింపచేస్తూ నీ కను చూపులతో అల్లరి చేస్తూ చిరు గాలికి చెదరిన కురులను మునివేళ్ళతో తీస్తూ ఎగసిన పైటను సర్దుకుంటూ చెదరని చిరునవ్వుతో పలుకరిస్తూ నన్ను తోడుగా రమ్మని సైగ చేసావు నీ అడుగులో అడుగునై సాగిపోదామనుకుంటే కలల లాంటి అలలు కల్లలు చేసాయి.


పసివాడు :- పండు వెన్నెలలో ఊసుల ఊయలలో నిదురిస్తున్న పాలబుగ్గల పసివాడు చందమామను కావాలని మారాం చేసాడు చందమామ కన్న అందమైన నిన్ను చూసి పులకరించిపోయాడు .


పిరికి ప్రేమికుడు :- నేను ప్రేమిస్తున్నానని మేఘం తో మొర పెట్టుకున్నా ప్రియురాలిని చేరేలోపే అది ఆనందంతో వర్షించి కనుమరుగై పోయింది సముద్రపు అలలతో నా ప్రేమ విషయం సంభాషించా ఆ అల నా కాళ్ళ దగ్గరే అలసిపోయింది మా చందమామ తో కూడా చెప్పా ఆ రోజు అతడు అలసి నిద్రపోయాడు మరుసటి రోజు ఆ విషయం మరచిపోయాడు ఒక జింక నా ప్రేమ విషయం చెబుతానన్నది దారి మద్యలో వేటగాడి బాణానికి బలి అయ్యింది అటుగా వెలుతున్న ఉడుత నాతో ప్రేమ


టెక్నాలజి :- పక్కన ఉన్న ఇంటివాడికి ఫోను చేసి హాయ్ చెబుతాం నూతన సంవత్సరం రోజు ఈ మెయిల్ గ్రీటింగ్ పంపిస్తాం పార్టికి రమ్మని యెస్ ఎమ్ యెస్ చేస్తాం టెక్నాలజి ఎంత చేరువైతే మనుషులు మనసులు అంత దూరం.


ఆత్మ విశ్వాసం :- భీడు పడ్డ్ భూమిని చూసి మేఘం వర్షాన్ని ఇచ్చింది సూర్యుని తాపాన్ని చూడలేక రాత్రి చల్లని వెన్నెలను ఇచ్చింది మునిగిపోతున్న మనిషిని ఒక సముద్రపు అల ఒడ్డుకు తెచ్చింది వైఫల్యాలు నిండిన మనిషికి ఆత్మవిశ్వాసం విజేతగా నిలుపుతుంది.


తెలుగు కవితలు :- హ్రుదయం లో పరిచయాన్ని నా కలం లో సిరా గా నింపుకున్నా పరిచయ అక్షరాల అభిమానాన్ని ప్రేమ అనే పదాలుగా రాస్తున్నా ప్రేమ పదాల వాఖ్యాన్ని ప్రణయ కావ్యం గా రూపోందించుకుంటున్నా.


తెలుగు కవితలు :- పక్షుల కిలకిల రావములతో సెలయేరు గలగల సవ్వడిలో తుమ్మెదల ఝుంకార నాదం తో అమ్మ ఒడి అనురాగం తో నిండిన తోటలో పెరిగిన నన్ను కసాయి తోటమాలి తుంచేసాడు పడుచు పిల్ల కొప్పులో అందంగా ఉండాలనుకున్నా పవిత్ర దేహాల సంగమానికి అలంకారిణి అవుదామనుకున్నా కానీ వేశ్యావాటికలో విటుల చేతికి బందించబడ్డాను వారి తాపాగ్ని కి భలి అయిపోయాను.


నా చెలి కురులు సాగరుని కెరటాలు నయనాల నయగారాలు జాబిలి పరవశాలు నా చెలి చెక్కిలిలు పాలమీగడ పులకరింతలు ఆమె చిరునవ్వు తేనె లాంటి మథురాలు తన అధరాలు పూల పరిమళాలు తన పలుకరింపులు కోయిల గానాలు ఆమె మనస్సు చల్లని వెన్నెల సొగసు ఆమె నడకలు సొగసైన పవనాలు తీరాలు దాటిన నా చెలి నా మనసు మెచ్చిన నా ప్రియసఖి .


గతం తలుచుకుని దిగులు చెందడు భవిష్యత్ గురించి ఆరాట పడడు తనకు శత్రువులు లేరు అలా అని మిత్రులూ లేరు ఆశా లేదు నిరాశా లేదు తను అందం అన్న ప్రీతి లేదు కురూపి అయినా భాధ లేదు లోకం పోకడ తెలియని పాల బుగ్గల పసివాడు కల్మషం లేని 'పసిడి' వాడు .

No comments:

Post a Comment